విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

AP: తన రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. 'సహజంగా రాజకీయ నేతలకు వారు ఉన్న పార్టీపై నమ్మకం లేకపోతే వేరే పార్టీలో చేరుతారు. వైసీపీ పరిస్థితి ఎలా ఉందో ఆ పార్టీ నేతలకే తెలుస్తోంది. దానిని బట్టి వారు నిర్ణయం తీసుకుంటారు. అది వైసీపీ సొంత అంశం' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్