మొక్కజొన్న రైతుల కోసం కేంద్రమంత్రికి చంద్రబాబు లేఖ

AP: రాష్ట్రంలోని మొక్కజొన్న రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు CM చంద్రబాబు నాయుడు కీలక అడుగు వేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు ఆయన ఒక లేఖ రాశారు. రబీ సీజన్‌లో పండించిన మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు మద్దతు ధర దక్కేలా చూడాలని ఈ లేఖలో కోరారు. ప్రస్తుతం మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు రోజురోజుకూ పడిపోతుండటం పట్ల సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్