లడ్డూ విషయంలో చంద్రబాబు అడ్డగోలుగా‌ మాట్లాడారు: వెల్లంపల్లి

AP: తిరుమల లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు అడ్డగోలుగా‌ మాట్లాడారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘లడ్డూలో జంతువుల కొవ్వు, చేపనూనె, పంది కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ ఇష్టానుసారం మాట్లాడారు. కానీ విచారణ చేసిన సిట్ అధికారులు కల్తీ లేదని తేల్చారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ మొకం ఎక్కడ పెట్టుకుంటారు? దుర్మార్గపు రాజకీయాల కోసం మతాన్ని అడ్డు పెట్టుకోవటం సిగ్గుచేటు’ అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్

✕
✕