AP: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులకే ప్రస్తుత ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తోందని ఆరోపించారు. జేఎస్‌డ్ల్యూ స్టీల్ ప్లాంట్‌కు 2022లోనే అన్ని అనుమతులు పూర్తయ్యాయని, చంద్రబాబు క్రెడిట్ చోరీలో ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఏ చట్టం తీసుకొచ్చినా రాష్ట్ర ప్రజలందరికీ ఒకేలా ఉండాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గం అట్టర్ ఫెయిల్యూర్ అని విమర్శించారు.