ఏపీ ప్రాజెక్టుల్లో నీటినిల్వలపై చంద్రబాబు సమీక్ష

ఏపీ ప్రాజెక్టుల్లో నీటినిల్వలపై సీఎం చంద్రబాబు గురువారం అమరావతిలోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వృధాగా సముద్రంలోకి వెళ్లే వరద నీటితో రిజర్వాయర్లు, చెరువులు నింపాలని చంద్రబాబు తెలిపారు. ఆగస్ట్ 31న కుప్పం కెనాల్‌కు హంద్రీనీవా నీళ్లు తరలించారని చంద్రబాబు పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి వరద నీటిని.. రాయలసీమ ప్రాజెక్టులకు తరలించే అంశంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్