చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే: లక్ష్మీ పార్వతి

AP: చంద్రబాబు పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి విమర్శించారు. ఒకే పెన్షన్ పథకాన్ని 22 సార్లు ప్రారంభించడం ప్రచార పిచ్చికి నిదర్శనమన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో రాజకీయ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని, రైతులకు సాగునీరు, గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని మండిపడ్డారు. డీఎస్సీ నియామకాలపై మంత్రి లోకేశ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనపై చర్చకు చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕