AP: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వాడకంపై చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను సీబీఐ నివేదిక తోసిపుచ్చింది. ఈ మేరకు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు రాక్షసంగా వ్యవహరించారని, సీబీఐ నివేదికతో ఆయన కుట్ర బయటపడిందని, హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ జగన్ను దెబ్బతీయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. చంద్రబాబు ఎత్తులను సీబీఐ నిర్వీర్యం చేయడంతో రాజకీయ దాడికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.