ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ఆలోచనలు దేశానికీ స్ఫూర్తి: పీయూష్ గోయెల్

కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ విశాఖలో జరిగిన CII భాగస్వామ్య సదస్సులో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు యావత్ భారత దేశ అభివృద్ధికి స్ఫూర్తిదాయకమని అన్నారు. గ్లోబల్ ట్రేడ్ గేట్‌వేగా విశాఖ ఎదుగుతోందని, స్టీల్, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రత్యేకతను చాటుకుంటోందని తెలిపారు. 2047 నాటికి 'స్వర్ణాంధ్ర విజన్'తో ఏపీ సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతం అవుతుందని, అదే సమయంలో భారతదేశం సుసంపన్నమైన దేశంగా అవతరిస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్