ఏపీలో చంద్రబాబు పాత పథకం.. రూ. 10 ల‌క్ష‌లు..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేయబోతోంది. పేదలు, కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి ఈ పథకం భద్రత కల్పిస్తోంది. శాశ్వతమైన వైకల్యంతో బాధపడేవారికి, ఈ పథకం కింద మరణించినవారికి బీమా మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. రూ.1.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బీమా సొమ్ము రెండు వారాల్లోగా బ్యాంక్ ఖాతాలో పడుతుంది.

సంబంధిత పోస్ట్