AP: వైసీపీ అధినేత జగన్ ఆదివారం ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నారాసుర పాలనలో అరాచకం పరాకాష్టకు చేరింది. వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారు. దాడి చేసిన వారికి సీఎం చంద్రబాబు రక్షణ కల్పిస్తూ.. బాధితులపైనే కేసు పెట్టి రాజకీయ కక్షకు పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం. ఎన్ని కేసులు పెట్టి వైసీపీ వెనక్కి తగ్గదు’ అని జగన్ ట్వీట్ చేశారు.