AP: సుపరిపాలన తొలి అడుగు పేరుతో సీఎం చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. లేదంటే ఆ మీటింగ్ లలో జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారన్నారు. 'లోకేశ్ రెడ్ బుక్ కారణంగా పతనమయ్యేది చంద్రబాబే. జగన్ అంటే ఈర్ష్య, భయంతోపాటు చంద్రబాబు అభద్రతాభావంతో ఉన్నారు. ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నాక కూటమి అయినా ఓటమి తప్పదు' అని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు.