AP: చంద్రబాబు మాటలు కేవలం అంకెల గారడీలు, పబ్లిసిటీ డ్రామాలు తప్ప మరొకటి కాదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. బడ్జెట్లో ఎలాంటి నిధుల కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రకటనలు గుప్పిస్తూ రైతులను మభ్యపెట్టడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పట్ల ఉన్న ప్రేమ కేవలం మాటలకు, ప్రచారాలకు మాత్రమే పరిమితమైందని దుయ్యబట్టారు.