చంద్రబాబు, ఎస్‌ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు: జగన్

AP: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు, ఎస్‌ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. 19 మున్సిపాలిటీల్లో నామినేషన్లను అడ్డుకున్నారని, దీనిపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. మైదకూరు, తిరుపతి, కడపలోని రాజంపేటలలో పరిమిత వార్డులకే రీనామినేషన్ అవకాశం కల్పించడం ఏకపక్ష గెలుపు కోసమేనని ఆయన ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో అధికార పక్షం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕