ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో స్థానిక సంస్థల కోటా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల కానుండగా,ఆగస్టు 30న ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను ఇరు పార్టీలు కూడా ప్రతీష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బొత్స మాత్రమే నెగ్గుకురాగలరనే అంచనాతో ఆయన పేరును జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.టీడీపీ నుంచి పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.