ఆ టీడీపీ ఎమ్మెల్యేలను పిలిపించనున్న చంద్రబాబు!

ఏపీలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటోంది. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అక్కడి నుంచి రాగానే కొందరు ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీతో కూటమి సర్కార్ 100 రోజుల పాలన పూర్తి చేసుకోబోతోంది. దీంతో మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేందుకు సీఎం సిద్దమవుతున్నారు. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపైన ఆగ్రహంగా ఉన్నారు. ఎల్లుండి ప‌నితీరు బాగలేని ఎమ్మెల్యేల‌తో.. బాబు భేటీ కానున్న‌ట్లు స‌మాచారం.

సంబంధిత పోస్ట్