తల్లికి వందనం డబ్బుల జమ తేదీ మార్పు?

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం నిధుల జమ తేదీ మారింది. దాదాపు 60 లక్షల మంది లబ్ధిదారుల అర్హుల వివరాల పరిశీలన, ఖరారు ప్రక్రియ ఆలస్యం కావడంతో ముందుగా అనుకున్న ఈ నెల 12న కాకుండా, తాజాగా జూన్ 19న నిధులను జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి అర్హుల సమాచారం వచ్చి, జాబితా సిద్ధమయ్యాక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ లెక్కన జూన్ 19న లేదా ఒక రోజు అటుఇటుగా నిధుల విడుదల ఖాయమని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్