AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ అంశం రాజకీయ చర్చకు దారితీసింది. దీనిపై టీడీపీ స్పందనలో మార్పు కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొలుత ఈ ప్రతిపాదనను తేలికగా తీసుకున్న టీడీపీ నేతలు, ఇప్పుడు వరుసగా స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. CM చంద్రబాబు అమరావతే రాష్ట్ర రాజధాని అని స్పష్టం చేయగా, టీడీపీ సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా ‘మావిగన్’పై వివరణాత్మక పోస్టులు చేస్తోంది. అయితే వైసీపీ మాత్రం ‘మావిగన్’కు అమరావతితో సంబంధం లేదని చెబుతుండగా, ఈ అంశం రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.