AP: పదో తరగతి ప్రశ్నపత్రాల్లో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్ సర్వేకు అనుగుణంగా ఈ ప్రశ్నపత్రాలను రూపొందించారు. 2026 పబ్లిక్ పరీక్షలకు సంబంధించి బ్లూ ప్రింట్, మోడల్ పేపర్లను విడుదల చేసింది. సృజనాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. విద్యార్థుల పనితీరు ఆధారిత అవగాహన పెంచేందుకు ఈ మార్పులు చేసినట్లు తెలిపింది.