AP: తిరుపతి నగర పాలక సమావేశంలో మూడో డివిజన్ వైసీపీ కార్పొరేటర్ దిండివనం గణేశ్‌పై జనసేన నేత దాడికి పాల్పడ్డాడు. గ్రేటర్ తిరుపతి ఎజెండాపై చర్చించేందుకు మేయర్ శిరీష అధ్యక్షతన శుక్రవారం నగర పాలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గందరగోళం ఏర్పడటంతో తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కళ్లెదుటే వైసీపీ కార్పొరేటర్‌పై, అసలు సభ్యుడే కాని వ్యక్తి వచ్చి దాడి చేయడం గమనార్హం. దాంతో కార్పొరేటర్ గణేశ్ కింద కూర్చొని నిరసన తెలిపారు.