YCP మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై చీటింగ్ కేసు

తెనాలి YCP మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై రూ.3 కోట్ల రుణం ఎగవేసిన ఆరోపణలపై చీటింగ్ కేసు నమోదైంది. ఐకేఎఫ్ ఫైనాన్స్ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. శివకుమార్‌ తెనాలిలో 1200 గజాల స్థలాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్నారని, అయితే అందులో 500 గజాలు తనఖా కంటే ముందే విక్రయించారని, రికార్డుల ప్రకారం ఆయన పేరుపై కేవలం 700 గజాలే ఉన్నాయని ఫిర్యాదుదారులు ఆరోపించారు. రుణం చెల్లింపులు నిలిచిపోవడంతో ఫైనాన్స్ సంస్థ రికవరీ ప్రక్రియ చేపట్టింది.

సంబంధిత పోస్ట్

✕
✕