చికెన్ షాప్ వివాదం.. వ్యక్తిని దారుణంగా కొట్టారు (వీడియో)

AP: పల్నాడు జిల్లా, పిడుగురాళ్లలో చికెన్ మార్కెట్‌పై పట్టు కోసం జరుగుతున్న పైరవీలు తీవ్రమయ్యాయి. తురకపాలెంకు చెందిన ఒక చికెన్ కొట్టు నిర్వాహకుడిపై కొందరు దుండగులు దాడి చేసి చితకబాదారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పట్టపగలే జరుగుతున్న దాడులు శాంతి భద్రతలకు సవాలుగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్