AP: ప్రకాశం జిల్లా కురిచేడులో గురువారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి అన్నదమ్ములు అభిషేక్(10), పాల్(8) మృతి చెందారు. దీంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. పిల్లలను చూసి కన్నతల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.