చదువు కోసం చిన్నారుల‌ సాహసం! (వీడియో)

AP: అల్లూరి జిల్లా పెదలువ్వాసింగి పంచాయతీ వయ్యంపల్లికి చెందిన సుమారు 15 మంది చిన్నారులు చదువు కోసం పెద్ద సాహసమే చేస్తున్నారు. రోజుకి రెండు కిలోమీటర్లు అటవీ ప్రాంతంలోని కొండలు, గుట్టలు దాటుకుంటూ తరబూసింగి పాఠశాలకు వెళ్తున్నారు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో అడవి జంతువులు, విషసర్పాలు సంచరించే అటవీ మార్గంలోనే రోజూ ప్రయాణం చేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి తమ గ్రామానికి రోడ్డు వేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕