పిల్లల బాధ్యత తల్లిది మాత్రమే కాదు: చంద్రబాబు

AP: చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని CM చంద్రబాబు ఆదేశించారు. పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయంలో చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్ వివరాలను తెలుసుకున్న ఆయన, పిల్లల పెంపకంలో మహిళలు సమన్వయం చేసుకుంటున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో భర్తలు, మగవారు కూడా బాధ్యత తీసుకోవాలని, పిల్లల ఆలనా పాలనా తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్