AP: విజయనగరం జిల్లాలో వైసీపీకి చెందిన ఐదుగురు జెడ్పీటీసీలు రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. చీపురుపల్లి వాలిరెడ్డి శిరీష, గజపతినగరం గార తవుడు, గంట్యాడ వర్రి నరసింహమూర్తి, విజయనగరం కెల్ల శ్రీనివాసరావు, కొత్తవలస నెక్కల శ్రీదేవి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్, వైసీపీలో దశాబ్దాలుగా పనిచేసిన చిన్న శ్రీను ఇటీవల కుమార్తెతో కలిసి టీడీపీలో చేరిన రెండు వారాలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. చిన్న శ్రీను అనుచరులే వీరితో రాజీనామాలు చేయించారని ప్రచారం జరుగుతోంది. మరిన్ని చేరికలు ఉంటాయని ఆయన వర్గం చెబుతోంది.