ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి?

ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గతంలో గుజరాత్ టూరిజానికి అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన తరహాలోనే, ఏపీ టూరిజం ప్రమోషన్ కోసం చిరంజీవిని నియ‌మించ‌నున్న‌ట్లుగా ప్ర‌చారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనపై ప్రాథమిక సంప్రదింపులు పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే కూట‌మి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్