చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అక్టోబర్ 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ జె. వెంకటనారాయణ తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.