పీవీకేఎన్ లో 57వ NSS దినోత్సవం

చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 57వ ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. పి. జీవనజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి, ఎన్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణవేణి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ. సరిత ఎన్ఎస్ఎస్ 2026 థీమ్ గురించి వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ డా. పి. జయచంద్రుడు 'నేను కాదు, నువ్వు' అనే మోటో సేవా భావానికి ప్రతీక అన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డా. జి. రాజేష్ కుమార్, కోఆర్డినేటర్ డా. హేమలత సేవా కార్యక్రమాల ప్రాధాన్యతను తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕