వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష

యాదమరి పోలీస్‌స్టేషన్ పరిధిలో వరకట్న వేధింపుల కేసులో నిందితుడు ఆర్. సతీష్‌కు VI అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా బుధవారం విధించింది. IPC 498-A కింద నేరం రుజువైనట్లు కోర్టు నిర్ధారించింది. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఇతర అభియోగాలు రుజువు కాకపోవడంతో వాటి నుంచి నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕