చిత్తూరు: ఆదేశాలను అమలు చేయని ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలి

తోతాపురి మామిడికి రూ. 12 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు గుజ్జు ఫ్యాక్టరీల యాజమాన్యం రైతుల దగ్గర నుంచి మామిడి కొనుగోలు చేయకపోవడం బాధాకరమని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు ఆదివారం పేర్కొన్నారు. టన్నుకు రూ. 12 వేలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా ఫ్యాక్టరీలు పట్టించుకోవడం లేదన్నారు. ఆదేశాలను అమలు చేయని ఫ్యాక్టరీల యాజమాన్యం పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్