చిత్తూరు నగర పరిధిలోని ఓ పాడుబడిన బావిలో చిరుత పులి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, బావి నుంచి చిరుత మృతదేహాన్ని బయటికి తీసి దహన క్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.