చిత్తూరు జిల్లాలోని పులిగుండును సాహస, పర్యావరణ, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. సుమారు1, 000 అడుగుల ఎత్తైన సహజ శిలా శిఖరాలు, శ్రీ పులిగుండేశ్వర స్వామి ఆలయం, APTDC హరిత హోటల్, ప్రభుత్వం కేటాయించిన 79ఎకరాల భూమిని ఆధారంగా అభివృద్ధి చేపట్టనున్నారు. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, ఎకో పార్క్, వ్యూ పాయింట్లు, క్యాంపింగ్, వసతి, పార్కింగ్, తాగునీరు, భద్రతా సదుపాయాలు కల్పించనున్నారు. విద్యుత్ దీపాల మరమ్మతులు, పునరుద్ధరణకు సుమారు10 లక్షలతో చర్యలు చేపడుతున్నారు. స్థానిక యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పులిగుండును పర్యాటక రంగంగా మార్చడానికి జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది