చిత్తూరు నగరం 31వ డివిజన్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను జిల్లా మాజీ మైనార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ డాక్టర్ సయ్యద్ గురువారం అందజేశారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదేశాల మేరకు సకాలంలో పింఛన్లు అందేలా చూడటమే తన కర్తవ్యమని డాక్టర్ సయ్యద్ అన్నారు. సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు.