నగరి నియోజకవర్గంలోని కూనమరాజుపాళెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ప్రతి ఏటా ఘనంగా జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం అక్టోబర్ 11 నుండి ప్రారంభం కానున్నాయి. ధ్వజారోహణకు సమర్పించే వస్త్రంపై మహాలక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన ఐరావతాన్ని చిత్రీకరించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో పుత్తూరు పట్టణానికి చెందిన నందినీ తనిగవేలన్ శుక్రవారం గజ పటాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రూపేష్ క్రిష్ణ ఆచార్యకు అందజేశారు. ఈ ఉత్సవాలు చిత్తూరు జిల్లాలోని నగరిలో జరగనున్నాయి.