చిత్తూరులో నులిపురుగుల నిర్మూలనకు భారీ ఏర్పాట్లు

చిత్తూరు జిల్లాలో సెప్టెంబర్ 25 శుక్రవారం జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. నాగ శశి భూషణ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో 1 నుండి 19 ఏళ్ల వయస్సు గల 3,10,910 మంది పిల్లలకు, విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు అందించనున్నారు. సెప్టెంబర్ 25న మాత్రలు తీసుకోలేని వారికి అక్టోబర్ 5న మాప్‌అప్ డే నిర్వహిస్తారు. విద్యా, వైద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని 100 శాతం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕