చిత్తూరు స్పాపై పోలీసుల మెరుపుదాడి.. 8 మంది అరెస్ట్

చిత్తూరు పట్టణంలోని లక్ష్మి వెల్‌నెస్ స్పాపై వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్పా ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించి, 5 మంది మహిళలను షెల్టర్ హోంకు తరలించారు. ఒక విటుడు, స్పా యజమాని, మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఎస్‌డీపీఓ జె. వెంకటనారాయణ పర్యవేక్షణలో ఈ దాడులు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 8 మంది అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕