పీవీకేఎన్ విద్యార్థుల సేవా స్ఫూర్తి

చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం 'స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర' పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జయచంద్రుడు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. జి. రాజేష్ ఆధ్వర్యంలో అధ్యాపక బృందం, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు కలిసి కళాశాల ఆవరణం, తరగతి గదులు, మైదానం పరిసరాల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. పరిశుభ్రత అలవాటు చేసుకోవడం వల్లనే ఆరోగ్యవంతమైన సమాజం, స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని ఆయన విద్యార్థులకు తెలిపారు. మన కళాశాల పరిశుభ్రత దిశగా అడుగులు వేయడం మన అందరి బాద్యత అని వైస్ ప్రిన్సిపల్ అధ్యాపకులకు, విద్యార్థులకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕