చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ. 165 నుంచి రూ. 176 వరకు అమ్ముడవుతోంది. మాంసం ధర రూ. 256 నుంచి రూ. 290 వరకు ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 289 నుంచి రూ. 315 వరకు పలుకుతోంది. ఈ ధరల పెరుగుదల వినియోగదారులపై ప్రభావం చూపుతోంది.