కుప్పంలో తప్పిన ప్రమాదం

కుప్పంలో ఆదివారం రాత్రి సుమారు 10.35 గంటలకు పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి పళణికి వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట కేబుల్ వైర్ తగిలింది. దీనితో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. బస్సు ముందుకు వెళ్ళగా, వెనుక బైక్‌పై వస్తున్న వారిపై కేబుల్ వైర్ పడటంతో వారు భయాందోళనకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నవారు కూడా పరుగులు తీశారు.

సంబంధిత పోస్ట్