ఆత్మీయ సమావేశానికి హాజరైన ప్రముఖులు

కుప్పం మండలం కంగుంది గ్రామంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ పి. ఎస్. మునిరత్నం ఆధ్వర్యంలో బుధవారం నాడు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కంగుంది లోని కాళికాంబ ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అనంతరం, టిడిపి పార్టీ శ్రేణులు మరియు ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మిత్రులు, శ్రేయోభిలాషులకు విందు భోజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులు పూర్తి ఆరోగ్యవంతుడిగా కంగుందికి విచ్చేసిన పీ. ఎస్ మణిరత్నం ను ఆప్యాయతతో పలకరించి పాత రోజులను నెమరవేసుకున్నారు. కార్యక్రమంలో చిత్తూరుజిల్లా పార్టీ ఇంచార్జ్ షణ్ముగం రెడ్డి, పిఎంకె ఉడా చైర్మన్ డా. సురేష్ బాబు, సీనియర్ పార్టీ నేతలు, రెస్కో డైరెక్టర్ అనసూయ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్