కుప్పంలో చంద్రబాబు చేతుల మీదుగా పెద్దబాలశిక్ష పుస్తకావిష్కరణ

కుప్పంలోని తన స్వగృహంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ముద్రించిన పెద్దబాలశిక్ష పుస్తకాలను బుధవారం ఆవిష్కరించారు. తెలుగు భాషా పురస్కారం కింద ప్రభుత్వం అందించిన రూ. 25 వేలతో పాటు మరో రూ. 25 వేల సొంత నిధులతో ఈ పుస్తకాలను ముద్రించినట్లు సమితి అధ్యక్ష, కార్యదర్శులు పి. తులసీనాథం నాయుడు, పుష్ప తెలిపారు. ఈ సందర్భంగా పుష్పకు సీఎం తెలుగు భాషా పురస్కార ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕