డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: కుప్పం ASP హేమంత్

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ విద్య, క్రీడలపై దృష్టి సారించాలని కుప్పం ASP బొడ్డు హేమంత్ IPS సూచించారు. గురువారం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕