కుప్పం మున్సిపాలిటీని అన్ని విధాలుగా రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని టీడీపీ కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్ పేర్కొన్నారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఆరు నెలలుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం పార్టీ కేడర్కు ఆయన వివరించారు. కుప్పం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.