నారాయణ ఈఎం స్కూల్ కుప్పం శాఖలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ సమక్షంలో విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధా వేషధారణలో ఆకట్టుకున్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.