చిత్తూరు జిల్లా కుప్పంలోని నారాయణ పాఠశాలలో గురువారం విద్యార్థుల నాయకత్వ సదస్సు (SLC) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏజీఎం శ్రీ ఫణికుమార్, ప్రిన్సిపాల్ శ్రీ విజయ్ కుమార్, ఈ-ఛాంప్స్ కో-ఆర్డినేటర్ శ్వేత, ఈ-కిడ్జ్ కో-ఆర్డినేటర్ అశ్విని పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ కార్యక్రమ నిర్వాహకులైన ఈ-ఛాంప్స్ వైస్ ప్రిన్సిపాల్ అంజలి, ఈ-కిడ్జ్ వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి మరియు వారి బృందాలను అభినందించారు. ఈ రెండు రోజుల కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.