నగరి: ఈ విధంగా మోసం చేయడం చాలా బాధాకరం: మాజీమంత్రి

మాజీ మంత్రి ఆర్కే రోజా మంగళవారం నగరి ఆర్డిఓ కార్యాలయంలో రైతులకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మహిళలను, రైతులను, విద్యార్థులను మూకుమ్మడిగా మోసం చేస్తోందని ఆరోపించారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా, పంటల బీమా, ఈ క్రాప్, పండించిన పంటలకు గిట్టుబాటు ధర వంటివి కల్పించకపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్