మామిడి రైతులకు మద్దతు ధర ప్రకటించినా, ఐదు నెలలుగా ఆ డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. రైతులకు ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన రూ. 370 కోట్లు త్వరగా ఇప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. నగరిలో బుధవారం మాట్లాడుతూ, రైతులకు డబ్బులు అందే వరకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని రోజా తెలిపారు.