పలమనేరులో పోలింగ్ కేంద్రాల పరిశీలించిన కమిషనర్

పలమనేరు మున్సిపల్ పరిధిలో పారిశుధ్య నిర్వహణపై కమిషనర్ లోకేశ్వర వర్మ బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని 36 వార్డులకు సంబంధించి 28 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న 72 మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, ర్యాంపులు, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 25, 26, 28 తేదీల్లో పోలింగ్ కేంద్రాల జాబితా, అభ్యంతరాల పరిశీలన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕