పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు గాను 76 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదంతో సిద్ధం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ K. లోకేశ్వర వర్మ తెలిపారు. ఈ జాబితాపై సాధారణ ప్రజలు మరియు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే ఈనెల 26 నాటికి మున్సిపల్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా అందించాలని సూచించారు. అలాగే అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పలమనేరు ప్రజలు, ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.