పలమనేరు పురపాలక సంఘ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాపూజీ ఉద్యానవనంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పలమనేరు మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి స్వచ్ఛత అవార్డు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్, మెప్మా సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.